ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బైరెడ్డిపల్లి లో ఘనంగా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పుట్టినరోజు వేడుకలు

బైరెడ్డిపల్లి లో ఘనంగా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పుట్టినరోజు వేడుకలు

📰 Generate e-Paper Clip

అధిక సంఖ్యలో తరలివచ్చిన టి.డి.పి.శ్రేణులు
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై2

మాజీ మంత్రి వర్యులు,పేదల పెన్నిధి,పలమనేరు శాసనసభ్యులు
అమరనాథ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్థానిక చెక్ పోస్ట్ నాలుగు కూడళ్ళు వద్ద మండల టి.డి.పి.అధ్యక్షుడు కిషోర్ గౌడు ,కార్యదర్శి సుబ్రమణ్యం శెట్టి ఆధ్వర్యంలో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈసందర్భంగా బాణసంచా పేల్చి తమ నాయకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది .మండల టి.డి.పి.శ్రేణులు ఆనందోత్సవాలతో కిషోర్ గౌడుచే కేక్ కట్ చేసి అందరికి పంచారు.ఈ సందర్భంగా కిషోర్ గౌడు మాట్లాడుతు బైరెడ్డిపల్లి మండలంలో వివిధ అభివృద్ధి పనులు మంజూరు కు ఎం.ఎల్.ఏ. చేయూత ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన ఇకమీదట కూడా మండల అభివృద్ధి కి దోహధపడాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండలం లోని సీనియర్ టి.డిపి.నాయకులు,
అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు,అభిమానులు తదితరులు పాల్గొనారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!