ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిభక్తి ప్రపత్తులతో అగ్నిగుండం ప్రవేశం

భక్తి ప్రపత్తులతో అగ్నిగుండం ప్రవేశం

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు మండలం కీలపూడి శ్రీ ముత్యాలమ్మ ఆలయం లో ఆదివారం సాయంత్రం కంకణం ధరించిన దీక్షాపరులు భక్తి ప్రపత్తులతో అగ్నిగుండం ప్రవేశం చేశారు.
కీలపూడి లోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో కొలుపు ఉత్సవాలు గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతోంది.
చివరి రోజైన ఆదివారం సాయంత్రం స్వామి, అమ్మవార్లను అగ్నిగుండం ఎదుట కొలువుదీర్చి కంకణం ధరించిన దీక్షాపరులు గోవింద నామ స్మరణలతో అగ్నిగుండం ప్రవేశం చేశారు.
ఈ అగ్నిగుండం ప్రవేశం లో పురుషులతో పాటు మహిళలు అగ్గి తొక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ విశేష కార్యాన్ని తిలకించడానికి కీలపూడి తో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు రావడం విశేషం.
ఆలయ ధర్మకర్త పాలు పద్మనాభం, యాదవ సంఘం ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించగా, పిచ్చాటూరు ఎస్సై రాఘవేంద్ర, ఏఎస్ఐ, పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముత్యాలమ్మ కొలుపు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీసు అధికారులు, గ్రామ ప్రజలకు ధర్మకర్త పాలు పద్మనాభం ధన్యవాదములు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!