ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్భక్తుల సౌకర్యార్థం రూ.3 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం

భక్తుల సౌకర్యార్థం రూ.3 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు జూలై 12 గరుడధాత్రి :
పిచ్చాటూరు మండలం రామగిరిలోని శ్రీ వాలీశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం రూ.3 లక్షల వ్యయంతో కాంక్రీట్ ఫ్లోరింగ్ పనులను ప్రారంభించారు. తిరువళ్లూరుకు చెందిన దాత కేబీఎం ఎయిలరసన్ తన సొంత నిధులతో ఈ పనులను చేపట్టగా, ఇవే రోజున పూర్తి చేయనున్నట్లు ఆలయ చైర్మన్ కేఎల్ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయంలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.13 లక్షలు మంజూరు చేసిందని, త్వరలోనే ఆ పనులను కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో హేమచంద్రరావు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు, పిచ్చాటూరు మండల బీజేపీ అధ్యక్షుడు కుభేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!