ePaper
Sunday, September 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మద్యం దుకాణాల రెన్యూవల్‌కు.. 21 వరకూ అవకాశం

మద్యం దుకాణాల రెన్యూవల్‌కు.. 21 వరకూ అవకాశం

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం సెప్టెంబర్ 13 గరుడదాద్రి న్యూస్

రాష్ట్రంలోని 3,736 రిటైల్ మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యూవల్‌కు ఈ నెల 21 వరకు ఆరు పనిదినాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. కొత్త లైసెన్సుల కోసం సెప్టెంబరు 22న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి… ఆ రోజు నుంచి 29 వరకు ఏడు పనిదినాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ‘రెన్యూవల్‌కు సంబంధించిన గెజిట్ నెంబర్లను సంబంధిత కలెక్టరేట్ల నుంచి ఎక్సైజ్ శాఖ తీసుకుంది. రెన్యూవల్‌కు గెజిట్ నోటిఫికేషన్‌ను శనివారం ప్రచురించాం. లైసెన్సుదారులుంతా నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి’ అని కోరారు. ప్రస్తుత లైసెన్సుదార్లు రెన్యూవల్ చేసుకొని, ఇతర కారణాలతో రెన్యూవల్ కాని దుకాణాల్ని లాటరీ ద్వారా కేటాయిస్తామన్నారు. లాటరీ నిర్వహించేందుకు కనీసం 4 దరఖాస్తులు ఉండాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!