కుప్పం అక్టోబర్ 1 (గరుడ ధాత్రి న్యూస్) : కుప్పం మండలం మల్లానూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పింఛన్ పథకం ద్వారా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయడం జరిగింది. ఆర్టీసీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి, రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వసతులతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. కుప్పం పి-4 కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. పింఛన్లు, సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అండగా నిలుస్తూ, అభివృద్ధి, నమ్మకం సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడాపిడి వికాస్ మరమ్మత్, పి కే యం ఊడా చైర్మన్ డాక్టర్ సురేష్ , ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్ , తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
