ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమాతమ్మ తిరునాళ్లులో పాల్గొన్న నూక తోటి రాజేష్

మాతమ్మ తిరునాళ్లులో పాల్గొన్న నూక తోటి రాజేష్

📰 Generate e-Paper Clip

నాగలాపురం మండలంలోని ఎస్‌.ఎస్‌.పురం గ్రామంలో జరుగుతున్న మాతమ్మ తిరునాళ్లకు సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూక తోటి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు, గ్రామ పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికి సాలువ కప్పి సన్మానించారు. అనంతరం అమ్మవారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా రాజేష్ అన్న మాట్లాడుతూ మాతమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వేడుకలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. తిరునాళ్లలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కార్యక్రమంలో ఆయనతోపాటు మండల నేతలు, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!