ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మైదుకూరులో డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ టౌన్ హాల్ సమావేశం - మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి విమర్శలు

మైదుకూరులో డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ టౌన్ హాల్ సమావేశం – మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి విమర్శలు

📰 Generate e-Paper Clip

గరుడదాత్రి న్యూస్, ఆగస్టు 3:

కడప జిల్లా మైదుకూరులోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాల అంశంపై టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శెట్టిపల్లి రఘురామిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క శాఖ కూడా సమర్థవంతంగా పనిచేయడం లేదని విమర్శించారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని, యువత భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో కూడా అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు.
డీఎస్సీ నియామకాల్లో అవినీతి జరిగిందని సాక్షాలతో చూపించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు. అవినీతి ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు విద్యార్థులకు నీతి, విలువలు ఎలా బోధిస్తారని ప్రశ్నించారు.
డీఎస్సీ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసే ధైర్యం మంత్రి నారా లోకేష్‌కు ఉందా అని ప్రశ్నించిన ఆయన, వైఎస్సార్‌సీపీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. స్పోర్ట్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థికి కాకుండా ఇతరులకు ఉద్యోగాలు ఇవ్వడం అవినీతికి నిదర్శనమని ఆరోపించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అలాగే, డీఎస్సీ అంశంపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో మైదుకూరులో రిలే నిరాహార దీక్షలు, 10వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు శెట్టిపల్లి రఘురామిరెడ్డి ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!