గరుడధాత్రి న్యూస్ :
ఉదయాన్నే వెంకట నగరం ప్రాంతం నుంచి గోదావరి మధ్యన ఉన్న లాగూన్స్ (మడుగులు) తనిఖీ చేశారు..
పేపర్ మిల్స్ యాజమాన్యం తూర్పులంకలోని ప్రత్యేక మడుగుల్లో కాలుష్యకారక నీటిని విడిచిపెడుతుంది. ఏ మేరకు శుద్ధి చేసి అక్కడ విడిచి పెడతారు.. ఆ ప్రాంత జలాల్లో ఉన్న కాలుష్యం ఎంత అన్న విషయాలను ప్రత్యక్షంగా వెళ్లి తెలుసుకున్న పవన్ కళ్యాణ్..
మట్టి, నీటి నమూనాలను సేకరించి అక్కడే మొబైల్ కిట్స్ ద్వారా పరీక్షలకు జరిపించిన పవన్ కళ్యాణ్..
కాలుష్యకారకాలు ఉన్నట్లు గుర్తింపు. నిబంధనలను పాటించనందున వెంటనే పరిశ్రమకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు. మడుగుల్లో గుర్రపు డెక్క పేరుకుపోయిన తీరుపై పీసీబీ అధికారులను ప్రశ్నించారు..
పరిశ్రమలకు రాయితీలపై భూములు ఇచ్చి ప్రోత్సహిస్తుంటే కనీసం పర్యావరణ స్పృహ కూడా లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి..
ఇంత కాలుష్యం విడుదల చేస్తున్న ఆంధ్ర పేపర్ మిల్క్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం..
ప్రభుత్వానికి ఆ పరిశ్రమ చెల్లించాల్సిన రూ. 13 కోట్ల బకాయిలు ఎందుకు వసూలు చేయలేకపోతున్నారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్..
అధికారులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే ప్రజలకు మేం సమాధానం చెప్పుకోవాలంటూ అధికారులపై అసహనం..
ఇలాంటి నీటినీ నదిలోకి వదిలి అక్కడ మన పిల్లల్ని స్నానం చేయించే సాహసం చేయగలమా అని ఆగ్రహం..
పరిశ్రమల కాలుష్యం విషయంలో కాలుష్య నియంత్రణ నిబంధనలు అందరూ పాటించాల్సిందే..
పరిశ్రమలు వాటిని పాటించేలా అధికారులు పని చేయాలి. క్షేత్రస్థాయిలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి ముఖ్యమంత్రితో, కాబినెట్ లో మాట్లాడి పరిష్కరిస్తాను.
