రాత్రిపూట హెడ్ లైట్స్ లేకుండా తిరిగే వాహనాలు, రేడియం స్టిక్కర్ లేకుండా వెళ్లే వాహనాలపై, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
ప్రొద్దుటూరు, జమ్మలమడుగు పోలీస్ సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశంలో పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ దిశా నిర్దేశం
గరుడ దాత్రి న్యూస్ కడప జులై 29:
రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు సబ్ డివిజన్ల నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు కారణాన్ని గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రిపూట హెడ్ లైట్స్ లేకుండా తిరిగే వాహనాలు, రేడియం స్టిక్కర్ లేకుండా వెళ్లే వాహనాలపై, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టాలని జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ఆదేశించారు.
మహిళా భద్రతపై గ్రామాలు, కాలనీలు, పాఠశాలలు, కళాశాలలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్.పి పోలీస్ అధికారులను ఆదేశించారు.
స్మార్ట్ పోలీసింగ్ ఇండికేటర్స్ అయిన CEIR, ఈ-సాక్ష్య, సి.సి.టి.ఎన్.ఎస్, ఈ- సమ్మన్స్, ఈ- ప్రాసిక్యూషన్స్ తదితర మాడ్యూల్స్ పై పట్టు పెంచుకుని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు.
సోషల్ మీడియా లో మహిళలు, బాలికలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి ఆదేశించారు.
స్కూళ్ళు, కాలేజీలలో సోషల్ మీడియా వల్ల మహిళలు, బాలికలకు కలిగే వేధింపులపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా భద్రత పై గ్రామాలు, కాలనీలలో, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్.పి ఆదేశించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీర్స్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వాస్తవాలను నిర్ధారించుకుని నిర్ణీత వ్యవధిలోగా చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్.పి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి గస్తీని పెంచడంతో పాటు గ్రామ సభలు, పల్లె నిద్ర, గ్రామాల సందర్శన తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.
గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రోన్ కెమెరాల ద్వారా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, బహిరంగ మద్యపానం చేసే వారిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
చోరీలు జరగకుండా గస్తీ పెంచాలని, చోరీ కేసుల్లో సొత్తును రికవరీ చేయాలని ఆదేశించారు.
పెండింగ్ కేసులను త్వరితగతిన చేధించాలని ఆదేశించారు. తీవ్రమైన నేరాలు, దొంగతనాల కేసులను సమీక్షించి దర్యాప్తు త్వరితగతిన జరిగేలా పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
‘శక్తి’ టీముల బీట్స్ పర్యవేక్షిస్తూ స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీస్ లు, వ్యాపార సముదాయాల వద్ద, రద్దీ ప్రాంతాలలో తప్పనిసరిగా పోలీస్ సిబ్బంది బీట్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి ఆదేశించారు.
ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా రిసెప్షనిస్ట్ ల ద్వారా మహిళల సమస్యలపై వచ్చే ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
షాపులు, లాడ్జిలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్ మెంట్లు తదితర జన సమ్మర్థమైన ప్రదేశాల్లో తప్పనిసరిగా సి.సి కెమెరాలు అమర్చుకుని, వాటి పనితీరుపై శ్రద్ద వహించేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్.పి ఆదేశించారు.
సమావేశంలో జమ్మలమడుగు డి.ఎస్.పి శ్రీ కె.వెంకటేశ్వర రావు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు సబ్ డివిజన్ లోని సి.ఐ లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.
