ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిలాహిరి లాహిరి లాహిరిలో... తెప్పపై విహరించిన శ్రీ పెనుశిల లక్ష్మీనృసింహస్వామి

లాహిరి లాహిరి లాహిరిలో… తెప్పపై విహరించిన శ్రీ పెనుశిల లక్ష్మీనృసింహస్వామి

📰 Generate e-Paper Clip

నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు శ్రీవార్లకు తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.శోభాయమానంగా అలంకరించిన తెప్పపై శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహస్వామి వారు ఉభయనాంచారులతో కలసి పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు హాజరై దేవదేవేరులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఉభయకర్తలుగా మేడికొండ పద్మమోహన్ నాయుడు,స్నేహ దంపతులు వ్యవహరించారు..ఈకార్యక్రమాల్లో ఆలయ డిప్యూటీ కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి,ఆలయ ఉత్సవ కమిటీ ఛైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి,సభ్యులు పీర్ల సోమయ్య యాదవ్,ఆలయ ప్రధాన అర్చకులు పెంచలయ్య స్వామి,రామయ్య స్వామి, టీటీడీ పాంచరాత్ర ఆగమపండితులు రామానుజాచార్యులు,శశి స్వామి, నాగరాజ స్వామి, వినోద్ స్వామి,వర్ధన్ స్వామి,బాలాజీ స్వామి,మలికార్జున స్వామి,గిరి స్వామి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!