చౌడేపల్లి సెప్టెంబర్ 12 గరుడ దాత్రి న్యూస్
మండల కేంద్రంలోని పుంగనూరు రోడ్, బోయకొండ ఆర్చ్ ఎదురుగా ఉన్న వరదా కాంప్లెక్స్‌లో జువారి కంపెనీకి చెందిన సొంత రిటైల్ ఔట్లెట్ “జైకిసాన్ జంక్షన్” ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జువారి సంస్థ డిప్యూటీ మేనేజర్ శివప్రసాద్ రెడ్డి, నాన్-బల్క్ కో-ఆర్డినేటర్ లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జైకిసాన్ జంక్షన్ ద్వారా రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను, ఉత్తమ సేవలను నేరుగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతికూల ఎల్‌నినో పరిస్థితుల్లో పంట దిగుబడులు దెబ్బతినకుండా ఉండటానికి రసాయనిక, డ్రిప్ ఎరువులతో పాటు జువారి కంపెనీకి చెందిన శక్తిమాన్, బయో-20, స్మార్ట్ సొల్యూషన్స్ వంటి సేంద్రియ ఉత్పత్తులు, న్యూట్రియంట్లను తప్పనిసరిగా వాడాలని సూచించారు. సమగ్ర పంట యాజమాన్య పద్ధతుల ద్వారా దిగుబడులను కాపాడుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.
ప్రారంభోత్సవం సందర్భంగా డ్రిప్ ఎరువులు, మల్చింగ్ షీట్లు, డ్రిప్ లేటర్లపై రైతులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. స్థానిక రైతన్నలు ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఔట్లెట్ మేనేజర్ రాజేష్, అకౌంటెంట్ భార్గవ్, పెద్ద సంఖ్యలో రైతు సోదరులు పాల్గొన్నారు.
