ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

📰 Generate e-Paper Clip

ఆసుపత్రి అభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,

కార్వేటి నగరం జూలై 29 గరుడ దాద్రి న్యూస్
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవనిజిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం కార్వేటి నగరం మండల పరిధిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆస్పత్రిలో రోగులకు అందు తున్న సేవలు, ఔషధాల నిల్వ, పరిసరాల శుభ్రత, రికార్డులను పరిశీలించారు. రోగు లతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందు తున్నాయోనని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఉండకూడదని, రోగులకు అవసరమైన సేవలను అందించాలని వైద్యా ధికారులకు సూచించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో నిరుపయోగంగా ఉన్న భవనాలను పరిశీలించారు, పాత భవనాన్ని పరిసరాలను పరిశీలించారు, ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవాలు
జరిగే విధంగా చర్యలు చేపట్టాలని డాక్టర్లకు సూచించారు. ఓపి శాతం
పెంచాలని ఆదేశించారు, డయాలసిస్ పేషెంట్లకు సక్రమంగా సేవలు అందించాలి, ఆసుపత్రి అభివృద్ధి కొరకు ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎంత మేర నిధుల అవసరము సిద్ధం చేయాలని ఆదేశించారు, వచ్చిన పేషెంట్లకు సురక్షితం మైన త్రాగునీరు అందజేయాలని ఆదేశించారు. బోర్లను పరిశీలించారు, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రం ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీపతి, గైనకాలజిస్ట్ డాక్టర్ కీర్తి, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!