ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్శంకర్ రెడ్డి చేరాళ్లకుప్పంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

శంకర్ రెడ్డి చేరాళ్లకుప్పంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

సత్యవేడు గరుడధాత్రి న్యూస్ :
సత్యవేడు నియోజకవర్గంలోని రాళ్లకుప్పం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి స్థానిక మండల నాయకులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన స్వయంగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేసి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి పారదర్శకంగా చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!