బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్3
బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామపంచాయతీ లోని శెట్టిపల్లి ఎం.పి.పి పాఠశాలలో గురువారంముందస్తు గోకులాష్టమి వేడుకలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు వివిధ వేషధారణలో పాల్గొని అలరించారు. గోపికలు, శ్రీకృష్ణుడు వేషధారణలు ధరించి కోలాటాలు చేయడం జరిగింది. పిల్లల యొక్క ప్రదర్శనలు ఆకొట్టుకున్నాయి. ఈ వేడుకలో పాఠశాలలోని అన్ని తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రావణి, ఉపాధ్యాయులు ప్రకాష్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
