ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీ ఎల్లమ్మ తిరునాళ్లలో పాల్గొన్న కోనేటి సుమన్ కుమార్

శ్రీ ఎల్లమ్మ తిరునాళ్లలో పాల్గొన్న కోనేటి సుమన్ కుమార్

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి న్యూస్ :
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం భీమునిచెరువు గ్రామ దేవత శ్రీ ఎల్లమ్మ తిరునాళ్ల మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గురువారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో చిత్తూరు ఉమ్మడి జిల్లాల జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు, నారాయణవనం జడ్పిటిసి శ్రీ కోనేటి సుమన్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.
గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా భక్తుల రద్దీ విశేషంగా కనిపించింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!