ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఏపీకి పోటెత్తుతున్న పెట్టుబడులు - సోమిరెడ్డి

ఏపీకి పోటెత్తుతున్న పెట్టుబడులు – సోమిరెడ్డి

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి న్యూస్ :
-చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కృషి ఫలితమే

-2029 నాటికి 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

-అమరావతికి కేంద్ర ప్రభుత్వం మద్దతు రాష్ట్ర భవిష్యత్తుకు గొప్ప భరోసా

-గొడ్డలి పార్టీకి గన్ కల్చర్, బెదిరింపు రాజకీయాలు ఇంకా పోలేదు

-మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడులో సీనియర్ నాయకులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

-మౌలిక సదుపాయాల రంగాల్లో అసాధారణ పురోగతి అంశంపై తీర్మానం ప్రవేశపెట్టిన సోమిరెడ్డి

సోమిరెడ్డి కామెంట్స్ :

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగు ప్రజలందరికీ మహానాడు శుభాకాంక్షలు
ఈ మహానాడు వేదికపై నుంచి పాతరోజులు గుర్తుకొస్తున్నాయి..ప్రతి మహానాడు ఒక ప్రత్యేకమైన అనుభూతి
అప్పట్లో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో మహానాడు జరుగుతుంటే కార్యకర్తలతో కలిసి నాంపల్లి నుంచి నడిచి ర్యాలీగా వెళ్లేవాళ్లం…తీగల కృష్ణారెడ్డి గుర్రపు స్వారీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు
తెలుగుదేశం పార్టీలో మూడు తరాలతో కలసి పనిచేసే అద్భుత అవకాశం నాకు లభించింది
పెద్దాయన నందమూరి తారక రామారావుతో మాకు ప్రత్యేక అనుబంధం ఉండేది… అప్పట్లో నెల్లూరులో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమానికి నేను అఖిలపక్ష కన్వీనర్ గా వ్యవహరించాను
రాష్ట్రమంతా సారా వేలం పాటలు జరిగినా, నెల్లూరులో జరగనీయకుండా అందరం కలిసి అడ్డుకున్నాం..
అప్పట్లో ఎన్టీఆర్ తో పాటు నారా చంద్రబాబు నాయుడిని కలసి మా పోరాటాన్ని వివరించాం…నెల్లూరు వీఆర్సీ మైదానంలో తలపెట్టిన సభకు ఎన్టీఆర్ ను ఆహ్వానించాం
ఆ సభకు హాజరైన ఎన్టీఆర్ సింహపురి గడ్డ సాక్షిగా ఉమ్మడి ఏపీకి ఒక మాట ఇచ్చారు..అధికారంలోకి రాగానే సారాను నిషేధించడంతో పాటు సంపూర్ణ మధ్య నిషేదం అమలులోకి తెస్తామని ప్రకటించారు
ఆ ఒక్క ప్రకటనతో దిగొచ్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లోనే సారాను నిషేధించింది
1994లో కాంగ్రెస్ ప్రభుత్వం చివరి దశలో జీవీకే -బీబీఐ కంపెనీ కోసం 2200 ఎకరాలు సేకరించింది. ఎకరాకు కేవలం రూ.35 వేలు మాత్రమే పరిహారం అందించింది
కొద్ది రోజులకు టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేగా రెండు బస్సుల్లో రైతులను తీసుకుని ఎన్టీఆర్ ను కలిశాం
రైతులకు జరిగిన అన్యాయాన్ని వివరించగానే ఆయన సానుకూలంగా స్పందించారు…
చంద్రబాబు నాయుడు ఆ వెంటనే తన కార్యాలయానికి మమ్మల్ని పిలిపించి 24 గంటల్లో పరిహారాన్ని రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు ఇప్పించారు
ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన అంశాలపై మాట్లాడే అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకు ధన్యవాదములు
వైసీపీ పాలనలో రాష్ట్రంలోని మూడు కీలకమైన శాఖలను మూతేశారు. ఆర్ అండ్, ఇరిగేషన్, వ్యవసాయ శాఖలను అస్తవ్యస్తం చేశారు
ఆయా శాఖలకు బడ్జెట్ లో కేటాయించిన నిధులను 40 శాతం కూడా ఖర్చుపెట్టకుండా నిర్లక్ష్యం చేశారు..రహదారుల పరిస్థితి మరీ దారుణం
2014-19 మధ్య టీడీపీ పాలనలో 25194 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపడితే, జగన్ రెడ్డి పాలనలో వేసింది కేవలం 1800 కిలోమీటర్లు మాత్రమే
కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో 5050 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరిగింది
2019కి ముందు బీటీ రోడ్ల నిర్మాణం 22,283 కిలోమీటర్లు వేస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది
కూటమి ప్రభుత్వం వచ్చాక 2500 కిలోమీటర్ల మేర రోడ్లు వేశాం
భారతమాల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన రోడ్ల నిర్మానికి వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వని క్రమంలో అవి ఆగిపోయిన పరిస్థితి
కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వం 8 జాతీయ రహదారులను ఆమోదించింది..మొత్తం పొడవు 1749 కిలోమీటర్లు..విలువ రూ.81879 కోట్లు
వైసీపీ పాలనలో రహదారుల దుస్థితి కారణంగా జరిగిన ప్రమాదాల్లో 43 వేల మంది ప్రాణాలు కోల్పోయారు
చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారులు గాడినపడుతున్నాయి..పరిస్థితుల్లో పూర్తి మార్పు వస్తోంది
రాజధాని అమరావతి నిర్మాణం కోసం 28538 మంది రైతు బిడ్డలు 34 వేల ఎకరాలు ఇచ్చారు
దుర్మార్గపు వైసీపీ పాలనలో వారంతా 1631 రోజులు పోరాడారు…230 మంది ప్రాణత్యాగం చేశారు
అమరావతి రైతులు, ఆడపడుచులు తిరుమలకు పాదయాత్రగా బయలుదేరితే మా నియోజకవర్గంలో వారిపై కక్షకట్టి ఇబ్బంది పెట్టారు
రైతుల భోజనం చేసేందుకు చేసేందుకు ఏర్పాట్లను పోలీసులతో బలవంతంగా తొలగించారు..నడిరోడ్డుపై కూర్చుని భోజనం చేసే పరిస్థితి తెచ్చారు
జగన్ రెడ్డి మొదటేమో అమరావతికి జైకొట్టారు..తర్వాత మూడు రాజధానులన్నారు..ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు..ఆయనకు గన్ కల్చర్ ఇంకా పోయినట్టు కనిపించడం లేదు
అమరావతిని నాశనం చేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు.
ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది..రాజధాని నిర్మాణం కోసం రూ.15 వేలు కోట్లు అందించి అండగా నిలబడింది
విట్, ఎస్ఆర్ఎం, బిట్స్ పిలానీ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు అమరావతికి వచ్చాయంటే చంద్రబాబు నాయుడి కృషి, నారా లోకేష్ బాబు పట్టుదలే కారణం
దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ అవకాశం అమరావతికి రావడం చాలా గొప్ప విషయం
రాష్ట్ర అభివృద్ధిలో ప్రాంతీయ ఆర్థిక మండళ్లు కూడా చాలా కీలకపాత్ర పోషిస్తున్నాయి
ఉత్తరాంధ్ర ఆర్థిక మండలిలో విశాఖ -చెన్నై కారిడార్ లో విశాఖ కేంద్రంగా ఐటీ, ఏఐ, ఫింటెక్, ఫార్మా తదితర పరిశ్రమలు వస్తున్నాయి
కోస్తా ఆంధ్రా ఆర్థిక మండలిలో సేవా, విద్య, వైద్య, ఎకానమి రంగాలు వస్తున్నాయి
రాయలసీమ ఆర్థిక మండలిలో ఎవరూ ఊహించని స్థాయిలో మార్పులు వస్తున్నాయి..
బెంగళూరు -చెన్నై కారిడార్ లో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, డ్రోన్, డిఫెన్స్ తయారీ రంగాలకు ప్రాధాన్యం లభిస్తోంది
గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులతో దేశంలోనే అతిపెద్ద హబ్ గా రాయలసీమ గుర్తింపుపొందుతోంది
ఈ అభివృద్ధిలో నారా లోకేష్ బాబు కృషి మరిచిపోలేనేది
రూ.1 లక్ష కోట్లతో ఉద్యానవ హబ్ ఏర్పాటు కూడా చాలా కీలకమైనది..ఈ రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.40 వేల కోట్లు పెట్టుబడి పెడితే ప్రైవేటు సంస్థలు రూ.60 వేల కోట్లు పెట్టుబడి పెడుతాయి
2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన జరగడం, మూడు ఆర్థిక మండళ్లలో సమతుల్య అభివృద్ధే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారు
ఒక్కో ప్రాంతం ఒక్కో ఆర్థిక శక్తిగా ఎదగాలని కంకణం కట్టుకున్నారు
రెండేళ్లలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు, లోకేష్ ల కృషి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు, డిప్యూటీ సీఎం కళ్యాణ్ సహకారంతో సాధ్యమయ్యాయి
పేదలకు పక్కా ఇల్లు అంటేనే పెద్దాయన ఎన్టీఆర్ గుర్తుకొస్తారు…
వైసీపీ పాలనలో పేదల ఇళ్ల నిర్మాణాన్ని కూడా నిర్లక్ష్యం చేసి అవినీతి కూపంగా మార్చారు
1 సెంటు, 1.5 సెంట్లలో ఇల్లు కట్టుకుంటే పేదలు ఎలా నివసించాలి. జగన్ రెడ్డికేమో లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్యాలెస్ లు
పులివెందులలో 8 వేల ఇళ్లను వైసీపీ నేతకు చెందిన రాక్రీట్ సంస్థ అత్యంత దారుణంగా కట్టింది..ఈ రోజు ఆ ఇళ్లలో గృహప్రవేశాలు చేసేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు
జగన్ రెడ్డి కుటుంబసభ్యులు నలుగురు…వారి కోసం యల్లహంకలో 29 ఎకరాలు, పులివెందులలో 3 ఎకరాలు, ఇడుపులపాయలో 3 ఎకరాలు, లోటస్ పాండ్ లో ఎకరా, తాడేపల్లిలో ఎకరా విస్తీర్ణంలో ప్యాలెస్ లు కట్టారు
లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న జగన్ రెడ్డి ప్యాలెస్ లలో 40 వేల మంది కాపురం ఉండొచ్చు..
పేదలకు మాత్రం ఒక సెంటులో ఇల్లు..ఆయనకేమో లక్షల చదరపు అడుగులు
శాశ్వతంగా సీఎంగా ఉండిపోవాలనే దురాశతో రిషికొండలో రూ400 కోట్లు ప్రజల సొత్తుతో ప్యాలెస్ లు కట్టించుకున్నారు
2018లో నెల్లూరులోని ఎస్వీజీఎస్ మైదానంలో పెట్టిన సభలో చంద్రబాబు నాయుడు ఒక్కో ఇంటికి రూ.50 వేలు అదనంగా ఇచ్చి మొత్తం రూ.2.30 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు..24 గంటల్లో జీఓ కూడా ఇచ్చారు
2019లో ప్రభుత్వం మారగానే జగన్ రెడ్డి ఆ రూ.50 వేలు కోత విధించి రూ.1.80 లక్షలకు పరిమితం చేశారు..ఆ సొత్తును కూడా సొంత మనుషులు దోచుకునే పరిస్థితి తెచ్చారు
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షలకు పెంచుతూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు
గొడ్డలి పార్టీ పాలనలో రాష్ట్రాన్ని అన్నివిధాల అధోగతి పాల్జేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!