ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసత్యవేడులో సిపిఎంకు ఎదురుదెబ్బ -సీనియర్ నేత అరుణాచలం రాజీనామా..

సత్యవేడులో సిపిఎంకు ఎదురుదెబ్బ -సీనియర్ నేత అరుణాచలం రాజీనామా..

📰 Generate e-Paper Clip

సత్యవేడులో సిపిఎంకు ఎదురుదెబ్బ..
సీనియర్ నేత అరుణాచలం రాజీనామా..
-మరో నలుగురు కార్యకర్తలూ గుడ్‌బై

సత్యవేడు ప్రాంతంలో సిపిఎం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అనుబంధ సంఘమైన కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఎం సీనియర్ నేత అరుణాచలం పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక నాయకత్వం పార్టీ సిద్ధాంతాలు, భావజాలాలను విస్మరిస్తోందని ఆరోపిస్తూ తన రాజీనామాను ప్రకటించారు.
పార్టీలో హోల్‌టైమర్లకే ప్రాధాన్యత ఇస్తూ, ఎన్నేళ్లుగా ఉద్యమాల్లో పనిచేసిన సీనియర్లను పూర్తిగా పక్కన పెడుతున్నారని అరుణాచలం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను పలుమార్లు జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని తెలిపారు.
వామపక్ష భావజాలాలకు ఆకర్షితుడై 2006లో సిపిఎంలో చేరిన అరుణాచలం, సత్యవేడు ప్రాంతంలో జరిగిన పలు కార్మిక, కర్షక, సామాజిక, భూ ఉద్యమాలకు ముందుండి నాయకత్వం వహించారు. ముఖ్యంగా శ్రీ సిటీ భూ సేకరణ వ్యతిరేక ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
2014లో సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా అరుణాచలంను సిపిఎం అధిష్టానం ప్రకటించింది. అయితే అనంతరం సిపిఎంతో జత కట్టిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అభ్యర్థి దొరస్వామికి టికెట్ కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.
ఇక నాగలాపురం సిపిఎం మండల కార్యదర్శి మురుగేషన్ కూడా పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తమ రాజీనామా లేఖలను సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజుకు వాట్సాప్ ద్వారా పంపించినట్లు తెలిపారు.
అరుణాచలం, మురుగేషన్ బాటలో మరో నలుగురు కార్యకర్తలు కూడా పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలు స్థానికంగా సిపిఎం శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!