సత్యవేడు నియోజకవర్గంలో ఘనంగా వర్చువల్ మహానాడు
గరుడధాత్రి న్యూస్ :
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కోలాహలంగా ప్రారంభమైన నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గంలోని పలు మండలాల్లో మహానాడు వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.
మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని పార్టీ పట్ల తమ ఐక్యతను చాటిచెప్పారు.
ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి, పరిశీలకులు మలిసెట్టి వెంకటేశ్వర్లు కలిసి ఒకటవ క్లస్టర్ బుచ్చినాయుడు కండ్రిగ, రెండవ మరియు మూడవ క్లస్టర్ వరదయ్యపాలెం, తొమ్మిదవ క్లస్టర్ రాళ్లకుప్పం ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వర్చువల్ మహానాడు కార్యక్రమాలను పరిశీలించారు.
పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, మహానాడు ద్వారా పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
