ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్50% సబ్సిడీపై జనుము, జీలగ విత్తనాల పంపిణీ

50% సబ్సిడీపై జనుము, జీలగ విత్తనాల పంపిణీ

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి న్యూస్ : నాగలాపురం
మండలంలోని రైతులకు జనుము, జీలగ విత్తనాలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి చిట్టి బాబు బుధవారం తెలిపారు. జూలై 2 నుంచి రైతు సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానంలో విత్తనాల పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతులు ఆధార్ కార్డు, పాస్‌బుక్ లేదా 1-బి జిరాక్స్ ప్రతులతో స్వయంగా హాజరై విత్తనాలు పొందాలని సూచించారు.
ఒక ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు ఒక బ్యాగు, అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు గరిష్టంగా రెండు బ్యాగులు మాత్రమే అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి విత్తనాలు పొందాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!