ప్రతిపక్షానివి పసలేని ఆరోపణలు-మంత్రి నారాయణ
-నెల్లూరులో విద్యపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి
-20 కోట్లతో అంతర్జాతీయ స్థాయి పాఠశాల నిర్మాణం
-15 వేల మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యే లక్ష్యంగా అడుగులు
-టీచర్ పోస్టుల భర్తీలో ప్రతిపక్షాల ఆరోపణలపై మండిపడ్డ మంత్రి
గరుడధాత్రి న్యూస్ :
విద్యావ్యవస్థలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలవాలన్నది యువనేత నారా లోకేశ్ సంకల్పమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు.ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు.నెల్లూరు సిటీలో 15 వేల మంది నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.
నెల్లూరులోని పరమేశ్వరి నగర్‌లో మంత్రి నారాయణ పర్యటించారు . వక్ఫ్ బోర్డు స్థలంలో 20 కోట్ల వ్యయంతో స్విమ్మింగ్ పూల్‌తో కూడిన అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆశయాలకు అనుగుణంగా విఆర్సీ తరహాలోనే మరో 14 పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో సిద్ధం చేస్తున్నామన్నారు.అవన్నీ పూర్తయితే 15 వేల మంది పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు.
డిసెంబర్ నాటికి ఎండ్ టు ఎండ్ రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు,అమృత్ పనులు పూర్తి చేసి, నగరాన్ని దుమ్ములేని నగరంగా మారుస్తామని హామీ ఇచ్చారు.
గత పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.పరిపాలన చేతకాక వ్యవస్థలను నిర్వీర్యం చేశారనిఆరోపించారు.ప్రస్తుతం చంద్రబాబు పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలతో పబ్బం గడుపుతోందని మండిపడ్డారు. పారదర్శకంగా జరుగుతున్న ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను చూసి ప్రతిపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పేద విద్యార్థుల పట్ల మంత్రి నారాయణ చూపుతున్న ప్రత్యేక చొరవను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రశంసించారు. సొంత నిధులు, సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న తీరు అభినందనీయమన్నారు.
వక్ఫ్ బోర్డు స్థలంలో స్కూల్ నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
అనంతరం మంత్రి ఇరుగాళ్లమ్మ సంఘం లోని మండలపరిషత్ పాఠశాలను పరిశీలించారు.అక్కడ నుంచి 14 వ డివిజన్ బాలాజీనగర్ చేరుకొని గ్రీనరీ,బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు.ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్న స్థానిక కార్పొరేటర్ కర్తం ప్రతాపరెడ్డిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత అశోక్ డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ ,రాష్ట్ర బీసీసెల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, మాజీ జెడ్పిటిసి విజేతా రెడ్డి,42వ డివిజన్ ప్రెసిడెంట్ షేక్ ఖలీల్ అహ్మద్, డివిజన్ ప్రధాన కార్యదర్శి షేక్ రఫీ అహ్మద్, పార్లమెంట్ మైనారిటీ కార్యదర్శి షేక్ కాలేషా, డివిజన్ కోఆర్డినేటర్ షేక్ ఉమర్, నెల్లూరు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంతియాజ్,రాష్ట్ర మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నౌషాద్,రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
