శ్రీకాళహస్తి నియోజకవర్గం,రేణిగుంట మండలం ఎలమండ్యం వద్ద నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి, తెదేపా జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు నారా లోకేష్ గారు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమం అనంతరం నారా లోకేష్ గారితో పాటు తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారితో కలిసి శ్రీకాళహస్తి భ్రమరాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెదేపా తిరుపతి పార్లమెంట్ కో ఆర్డినేటర్ దామచర్ల సత్య, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు, జీడి నెల్లూరు ఎమ్మెల్యే వి యం థామస్ గారు, శ్రీకాళహస్తి మార్కెట్ యార్డు చైర్మన్ చెంచయ్య గారు, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి గారు,తదితరులు పాల్గొన్నారు.
ముందుగా ఆలయానికి చేరుకున్న నారా లోకేష్ గారికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయి ఆలయ అధికారులు మహా ద్వారం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం యువనేత నారా లోకేష్ గారు భ్రమరాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ వేద పండితులు మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని,వేదాశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు అందించారు.
రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో మరింత అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించిన్నట్లు తెలిపారు.
దర్శనానంతరం నారా లోకేష్ గారు భక్తులతో మాట్లాడుతూ,అభివాదం చేస్తూ ఆలయం వెలుపలకు చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, ఆలయ అధికారులు, సిబ్బంది, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర సేవలో మంత్రి నారా లోకేష్
RELATED ARTICLES
