ఎమ్మెల్యే విజయశ్రీ, ఇంచార్జ్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఓజిలి మండల నాయకుల వినయపూర్వక భేటీ
శ్రీహరికోటలో జరిగిన రాకెట్ లాంచింగ్ కార్యక్రమం సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను శ్రీ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద టిడిపి నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సంద ర్భంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది.ఓజిలి మండల అధ్యక్షుడు పాడి వెంకట సుబ్బయ్య యాదవ్, మాజీ అధ్యక్షుడు గుజ్జులపూడి విజయ్ కుమార్ నాయుడు పాల్గొన్నారు.మంత్రికి పూలమాల లతో స్వాగతం పలుకుతూ నాయకులు అభినందనలు తెలిపారు.శ్రీహరికోటలో జరిగిన రాకెట్ ప్రయోగం దేశ గర్వకారణమని వారు అభిప్రాయ పడ్డారు.ప్రాంత అభివృద్ధిపై మంత్రితో నేతలు చర్చించి నట్లు సమాచారం.మండల సమస్య లను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.నారా లోకేష్ కూడా స్థానిక నాయకులతో సానుకూలంగా స్పందించారు.పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి సూచించినట్లు తెలిసింది.ఈ భేటీతో స్థానిక టిడిపి నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
