ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం
చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ
రాష్ట్రంలో67,47,190 మందికి లబ్ది
కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్):
ఈనెల 22న తల్లికి వందనం ఆర్థిక సహాయం విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసానిచ్చేందుకు విద్యాశాఖను చేపట్టిన మంత్రి నారా లోకేష్ పిల్లల చదువులకు మూలధనంగా అందించే ఆర్థిక సాయం పథకానికి తల్లికి వందనంగా నామకరణం చేశారు. చదివే పిల్లలు అందరికీ వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలుచేశారు. రెండో ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే తల్లికి వందనం నిధులు 22వ తేదీ నుంచి తల్లుల ఖాతాల్లో జమ చేసేలా జీవో విడుదల చేశారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రూపొందించేందుకు లోకేష్ ఒక బృహత్తర యజ్ఞం చేపట్టారు. తల్లికి వందనం దేశంలోనే విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, అతి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే పథకంగా నిలుస్తోంది. 22వ తేదీన నే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులలోని కార్యాలయాలలో అర్హుల జాబితా ప్రచురిస్తారు.
