ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపిచ్చాటూరు మండల విద్యార్ధులకు షైనింగ్ స్టార్ అవార్డ్స్

పిచ్చాటూరు మండల విద్యార్ధులకు షైనింగ్ స్టార్ అవార్డ్స్

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో “షైనింగ్ స్టార్స్ 2026 అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం” సోమవారం (20-07-2026) తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు మండలానికి చెందిన పదవతరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన ఆరుగురు
(సాయిరాం విద్యాలయం..5, జేబిఆర్..1) విద్యార్థులు గౌరవ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి మరియు గౌరవ తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, గౌరవ తిరుపతి జిల్లా డీఈఓ కెవిఎన్ కుమార్ చేతులమీదుగా ఒక్కొక్కరు రూ.20,000 నగదు పురస్కారం అందుకుని మండలానికి విశిష్ట గుర్తింపు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా పిచ్చాటూరు మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి కె. హేమమాలిని గారు అవార్డు గ్రహీతలను అభినందించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తూ, విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి పిచ్చాటూరు మండలానికి, తిరుపతి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పిచ్చాటూరు మండలానికి చెందిన విద్యార్థులు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకోవడం పట్ల మండల వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!