ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో సమస్యల పరిష్కారానికి చర్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో సమస్యల పరిష్కారానికి చర్యలు

📰 Generate e-Paper Clip

ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం.
కుప్పం ఎన్టీఆర్ భవన్లో సమస్యల పరిష్కార వేదిక.
టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు.
సమస్యలతో భారీగా తరలి వచ్చిన ప్రజలు.
కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్):
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సోమవారం కుప్పం బైపాస్ రోడ్ లోని ఎన్టీఆర్ భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం చేపట్టారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కొనసాగించారు. కుప్పం రూరల్ ,కుప్పం అర్బన్, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల నుంచి ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో మునిరత్నం దృష్టికి తీసుకువచ్చారు. అర్జీలను అందుకుని పరిశీలించిన ఆయన ముఖ్యమంత్రి దృష్టికి ప్రజల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సలహా మండలి సభ్యులు ఎస్. రాజ్ కుమార్, టిడిపి నాయకులు రాజు, కే. కన్నన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!