ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిషైనింగ్ స్టార్స్ అవార్డులను అందుకొన్న గ్రామీణ ఆణిముత్యాలు

షైనింగ్ స్టార్స్ అవార్డులను అందుకొన్న గ్రామీణ ఆణిముత్యాలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై20

బైరెడ్డిపల్లి మండలంలో 2006 విద్య సంవత్సరం పదవ తరగతి పరిక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన బాలికలకు ఆదివారం చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో*షైనింగ్ స్టార్స్ అవార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. అవార్డ్ పొందిన విద్యార్థినులకు 20 వేల రూపాయల పారితోషికం,మెరిట్ సర్టిఫికెట్, మెడల్ ను అందించి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.బైరెడ్డిపల్లి మండలం కు చెందిన పెద్దచెల్లారగుంట జడ్.పి.ఉన్నత పాఠశాల కు చెందిన ప్రవల్లిక, కమ్మనపల్లి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల చెందిన జ్ఞాన సుష్మిత,మహాలక్ష్మి,జోష్ణ,పూజ,నవ్య విద్యార్థినులకు ఈ అవార్డ్స్ పొందారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, తల్లిదండ్రులు,ప్రజా ప్రతినిధులు, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారిణి దేసమ్మ అవార్డ్ గ్రహీతలు ను అభినంధించి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!