కార్వేటి నగరం జూలై 22 గరుడ దాద్రి న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్ అవార్డులో ఆరు అవార్డులకు గాను విద్యార్థులు కె డిసౌమ్య 581, పి ఆర్ సుజనా శ్రీ 578, ఎస్ వాత్సల్య 561 మూడు అవార్డులు కైవసం చేసుకుని మండల స్థాయిలో ప్రథమ స్థానం నిలిచారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, “విద్యార్థుల కృషికి ప్రభుత్వం అందించిన ఈ గుర్తింపు మా విద్యాసంస్థకు గర్వకారణం. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు ఇలాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించేలా ఉత్తమ విద్యను అందించడానికి కట్టుబడి ఉన్నాము” అని తెలిపారు.
అవార్డు గ్రహీతలను పాఠశాలలో ప్రత్యేకంగా సన్మానించి, వారి విజయాన్ని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచేలా అభినందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ విజయంతో SLN విద్యాసంస్థలు, కార్వేటినగరం మరోసారి నాణ్యమైన విద్య, విలువలతో కూడిన బోధన మరియు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న విద్యాసంస్థగా తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లత, పాఠశాల డైరెక్టర్లు దిలీప్ కుమార్ , ధనుంజయ రెడ్డి, వెంకటేష్, పురుషోత్తం పాల్గొన్నారు.
