సీఎం సతీమణి పర్యటనను విజయవంతం చేయండి.
సమిష్టిగా ప్రభుత్వ పథకాలను విజయవంతం చేద్దాం.
జిల్లా టిడిపి అధ్యక్షులు షణ్ముగం రెడ్డి, కుప్పం టిడిపి ఇన్చార్జ్ మునిరత్నం.
కుప్పంలో పార్టీ సమావేశానికి భారీగా తరలివచ్చిన పార్టీ యంత్రాంగం.
కుప్పం,జులై 22 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయాలను ఇంటింటా ప్రజలకు వివరిద్దామని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షణ్ముగం రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ కుప్పం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పి.ఎస్. మునిరత్నం లు పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ప్రతి నెల మూడవ బుధవారం నిర్వహించే కుప్పం నియోజకవర్గ సమీక్ష సమావేశం కుప్పంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. కుప్పం అర్బన్ టీడీపీ అధ్యక్షులు వెంకటేష్, కుప్పం రూరల్ టిడిపి అధ్యక్షులు రాజగోపాల్, గుడిపల్లి టిడిపి అధ్యక్షులు సుబ్రమణి, శాంతిపురం టిడిపి అధ్యక్షులు నందిగం ఉదయ్ కుమార్ నాయుడు, రామ కుప్పం టిడిపి అధ్యక్షులు, వివిధ హోదాల్లోని నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు, పార్టీ లోని స్థాయి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ల ఆదేశాల మేరకు ఈనెల 27వ తేదీ నుంచి ఇంటింటా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని, ప్రభుత్వ విజయాలను ఇంటింటా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు.
సర్ కార్యక్రమం ముగియ నుందని, ఇంకా ఎవరైనా ఓటర్లుగా నమోదు చేసుకోకుంటే నమోదుకు అందరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. ఈ నెల27 నుంచి ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటన ఉంటుందని, పర్యటన విజయవంతానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన వారు ఎవరైనా మిగిలి ఉంటే తల్లికి వందనం అందే విధంగా కృషి చేయాలన్నారు. పార్టీ యంత్రాంగమంతా కలిసికట్టుగా ఉండాలని అప్పుడే పార్టీ బలోపేతంగా ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన కార్యాచరణపై సమీక్ష నిర్వహించడం జరిగింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమ లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసేలా, ప్రజలతో నిరంతరం మమేకమై సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే రాబోయే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ
కార్యక్రమంలో మతో పాటు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, కడా సలహా మండలి సభ్యులు రాజ్ కుమార్, కుప్పం నియోజకవర్గ నాయకులు మునుస్వామి, చంద్రశేఖర్, బేటప్ప నాయుడు, బాబు నాయుడు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దామోదరం నాయుడు, నాయకులు సురేష్ బాబు, సోమశేఖర్, కే. కన్నన్, మున్సిపల్ చైర్మన్ సెల్వ రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ డి. సుధీర్, సత్యేంద్ర శేఖర్, గోపీనాథ్, ప్రతాప్ కుమార్, శ్యాంసుందర్, మండల అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు మహిళలు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
