ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో వైభవంగా మాస కల్యాణ మహోత్సవం

వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో వైభవంగా మాస కల్యాణ మహోత్సవం

📰 Generate e-Paper Clip

​మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారి ఆధ్వర్యంలో వేడుకలు

​శాస్త్రోక్తంగా ప్రత్యేక* పూజలువేద పఠనం
​విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు

​గరుడదాత్రి న్యూస్ మైదుకూరు, జూలై 26:
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మాస కల్యాణ మహోత్సవం ఆదివారం మఠ ప్రాంగణంలో అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారి దివ్య ఆశీస్సులతో, వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు.
​ఉదయం నుంచే వేద పండితులు, దేవస్థానం పూజారులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి మాస కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ సాగిన ఈ పూజా కార్యక్రమాల్లో మఠాధిపతుల వారి సోదరులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
​ఈ మహోత్సవంలో మాస కల్యాణ ఉభయదాతలు, మఠం సిబ్బంది పరిపూర్ణాచార్యులు, గోపాల చారి, సుబ్బరాయుడుతో పాటు స్థానిక, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులందరికీ స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!