ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వైఎస్సార్‌సీపీ ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భేటీ

వైఎస్సార్‌సీపీ ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భేటీ

📰 Generate e-Paper Clip

*​కడప – ముద్దనూరు రహదారి 4 లైన్లుగా విస్తరించాలి ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి*

*కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతి….*

*సానుకూలంగా స్పందించిన మంత్రి*

గరుడ దాత్రి న్యూస్ ​న్యూఢిల్లీ జులై 29:-
వైఎస్సార్‌ జిల్లాలోని పలు కీలక రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులపై కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్. అవినాష్ రెడ్డి గారు, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గారిని కలసి వినతిపత్రం సమర్పించారు.
​ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారుల అభివృద్ధిపై ఎంపీ గారు మంత్రికి క్రింది విన్నపాలను అందించారు:
​ వైఎస్సార్‌ జిల్లాలోని ముద్దనూరు నుంచి కడప వరకు ఉన్న రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించి అభివృద్ధి చేయాలి.
​కడప నగరంలోని ఇర్కాన్‌ సర్కిల్‌ నుంచి జేఎంజే సర్కిల్‌ వరకు ఉన్న రహదారిని 4 లైన్లుగా మార్చాలి.

​ట్రాఫిక్ నివారణకు మౌలిక వసతులు: కడప కార్పొరేషన్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఇర్కాన్‌ సర్కిల్‌ నుంచి ఐటీఐ సర్కిల్‌ వరకు:
​నాణ్యమైన ఫుట్‌పాత్‌ల నిర్మాణం
​ఇంటర్‌లాకింగ్‌ పేవర్‌ బ్లాక్స్‌తో ప్రత్యేక పార్కింగ్‌ సదుపాయం
​వర్షపు నీరు నిలవకుండా ‘స్టార్మ్ వాటర్ డ్రైనేజీ’ ఏర్పాటు పనులు చేపట్టాలి.
​ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి గారు సమర్పించిన పై మూడు ప్రతిపాదనలపైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ రహదారుల విస్తరణ మరియు అభివృద్ధి పనులపై త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!