ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పిచ్చాటూరులో 'రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమం

పిచ్చాటూరులో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, ఆగస్టు 3 గరుడధాత్రి:

కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా పిచ్చాటూరు మండలంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్, జెడ్పీటీసీ సభ్యుడు, జిల్లా ఫైనాన్స్ కమిటీ సభ్యుడు సుమన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు అండగా నిలుస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలకే పరిమితం కాకుండా, వాటికి మించి అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు, ఏఎంసీ మాజీ చైర్మన్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇలంగోవన్ రెడ్డి, రవి రెడ్డి, వాసు రెడ్డి, ఢిల్లీ, కె.వి.పురం రామాంజనేయులు, గోపిరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!