ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నిరుపేదలకు తక్కువ ధరలకే సన్న బియ్యం

నిరుపేదలకు తక్కువ ధరలకే సన్న బియ్యం

📰 Generate e-Paper Clip

– సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

నారాయణవనం ఆగస్టు0 3 (గరుడదాత్రి న్యూస్) రాష్ట్రంలోని పేద నిరుపేద ప్రజలకు తక్కువ ధరలకే సన్న బియ్యం అందించాలన్న కూటమి ప్రభుత్వం హామీలో భాగంగా సోమవారం నారాయణవనం మండల కేంద్రంలోని గణేష్ మోడరన్ రైస్ మిల్లులో సత్యవేడు ఎమ్మెల్యేకోనేటి ఆదిమూలం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రజలకు అధిక ధరలకు అందుతున్న బియ్యానికి బదులుగా కూటమి ప్రభుత్వం ఆయా రైస్ మిల్లుల ద్వారా తక్కువ ధరలకు సన్నబియ్యం అందించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.ప్రస్తుతం మార్కెట్లో 26 కేజీల సన్న బియ్యం 1550 నుంచి 1600 రూపాయలు ధర పలుకుతుందన్నారు.అయితే ప్రభుత్వం నిర్ణయించిన కేంద్రాల ద్వారా కిలోపైన ₹10 తగ్గించి సన్న బియ్యం, బుడ్డ బియ్యమును అందించడం జరుగుతుందన్నారు. ఈ సన్న బియ్యం ఒక రేషన్ కార్డు కి ఒక నెలకి సంబంధించి 26 కిలోల బస్తాను మాత్రమే అందించడం జరుగుతుందన్నారు.ఈ అవకాశాన్ని మండలంలోని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు.అంతకుముందు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంని గణేష్ మోడరన్ రైస్ మిల్ యజమాని కేజీ లక్ష్మణన్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ భార్గవి, సివిల్ డిప్యూటీ తాహసిల్దార్ హరినాథ్, ఆర్ ఐ అంజనమ్మ పిచ్చాటూరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలంగోవ రెడ్డి, ఎస్ ఎం సురేష్ స్థానిక నాయకులు కుట్టి బాలయ్య, డి.ఆరుముగం, వి సుబ్రహ్మణ్యం, దేవరాజులు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!