మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్)
సైదాపురం మండలంలోని జోగి పల్లి లో ఉన్న ప్రముఖ pbj మైనింగ్ కంపెనీలో JCB ఆపరేటర్ గా పనిచేస్తున్న లేబాకు రాజా ఎలక్ట్రానిక్ వైర్లు దొంగతనం చేశాడు అనే నెపంతో pbj మైన్ ఓనర్ గిరి సైదాపురం పోలీస్ స్టేషన్ లో తీసుకువెళ్లి బాధితుడైన లేబాకు రాజా అన్యాయంగా ఎస్సై మరియు పోలీసులు అన్యాయంగా తీవ్రంగా కొట్టడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు ఆదూరు రత్నం, ఎమ్మార్పీఎస్ వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మంగళపూరి సురేష్ మాదిగ, మార్పు సంస్థ అధినేత చిగురుపాటి పవన్,APWJ కార్యదర్శి పల్లిపాటి జోసెఫ్,గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపల్లి సిసింద్రీ మాదిగ గూడూరు ప్రాంతీయ హాస్పిటల్ కి వెళ్లి బాధితుడును పరామర్శించి లేపాకు రాజాపై దొంగతనం నేపం వేసిన pbj మైనింగ్ ఓనర్ గిరి పై మరియు కొట్టిన ఎస్సై మరియు పోలీస్ సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని లేదంటే 48 గంటల్లో భవిష్యత్తున కార్యచరణ ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం సైదాపురం పర్యటనలో ఉన్న స్థానిక శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ను కలిసి సైదాపురం ఎస్ఐ దుర్గాప్రసాద్ మరియు కానిస్టేబుల్ నరేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారికి తెలియజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా సహకరిస్తూ తక్షణమే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో సైదాపురం మండల అధ్యక్షులు గంగాధర్ మాదిగ, దక్కిలి మండల అధ్యక్షులు జడ వినోద్ కుమార్ మాదిగ, కుమ్మరిగుంట మస్తాన్,యాలపల్లి శ్రీనివాసులు, పెంచలయ్య, రమణ రావు,కార్యకర్తలు మరియు బాధిత కుటుంబ సభ్యులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
