ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పంలో 10 న.కూటమి నేతల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ

కుప్పంలో 10 న.కూటమి నేతల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ

📰 Generate e-Paper Clip

* ఏర్పాట్లు చేసిన పార్టీ యంత్రాంగం.
కుప్పం,ఆగస్టు 09 (గరుడ ధాత్రి న్యూస్): నియోజకవర్గ కేంద్రమైన కుప్పంలో నేడు సోమవారం కూటమి నేతల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పార్టీ యంత్రాంగం చేపట్టింది. సోమవారం ఉదయం 10 గంటలకు కుప్పం బైపాస్ రోడ్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నుండి పట్టణ నడిబొట్టులోని బస్టాండ్ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు వ్యక్తం చేసిన విశ్వాసానికి ప్రతీకగా ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ కేంద్రం పరిధి నుంచి 50 మందికి తక్కువ కాకుండా ప్రజలు నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించారు. సోమవారం ఉదయం 10 గంటల లోపే కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు కుప్పంలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. మన విజయమే మన లక్ష్యం అంటూ మన ఐక్యతే మన బలం అంటూ కూటమి నాయకులు పిలుపునిస్తూ ముందుకు సాగుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!