ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్శ్రావణ సహకార డిపాజిట్ చేసుకోండి

శ్రావణ సహకార డిపాజిట్ చేసుకోండి

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి సెప్టెంబర్ 03 గరుడ దాత్రి న్యూస్

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చౌడేపల్లి బ్రాంచ్ చీప్ మేనేజర్ ఎం నాగవేణి ఆధ్వర్యంలో శ్రావణ సహకార డిపాజిట్లు గురించిచౌడపల్లి వాసవి కన్యకాపరమేశ్వరి కమ్యూనిటీ హాల్ నందు సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సమావేశంలో బ్రాంచ్ మేనేజర్ నాగవేణి మాట్లాడుతూ ఈ డిపాజిట్ 456 రోజులుప్రత్యేక డిపాజిట్ వడ్డీ శాతం 7.60 ,60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్ వారికి 8.20 శాతము ,80 సంవత్సరాలు పైబడిన వారికి 8.30 శాతము .ఇవ్వటం జరుగుతుంది ఈ పథకం సెప్టెంబర్ 30 తేదీ వరకు ఉంటుందని తెలియజేశారు అలాగే ప్రతిరోజు బంగారుపైన రుణం ఇస్తున్నాం హౌసింగ్ ప్లాట్ పైన ఇంటి నిర్మాణం పైన వ్యాపారస్తులకు లోను సౌకర్యం కల్పిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మహిళలకు రుణాలు కలిపిస్తున్నాము రైతులు సంక్షేమ కోసం పంట రుణాలు పైన ప్రత్యేకంగా రైతుల సౌఖ్యం అప్పులు ఇస్తున్నాం సకాలంలో చెల్లించిన వారికి ప్రభుత్వం నుండి వచ్చే రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డిపాజిట్లు కు రైతులకు సంక్షేమం కోసం ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిసిసి బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ రెడ్డప్ప స్టాప్ గీత డిపాజిటర్స్ రైతులు పాల్గొన్నారు డిపాజిటర్స్ ఐ. రామ్ కుమార్ కృష్ణమూర్తి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో డిపాజిట్లు చేపించాము అని మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!