ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మరో నాలుగు అవార్డులు సొంతం చేసుకున్న సేవారత్న డాక్టర్ మురుగన్

మరో నాలుగు అవార్డులు సొంతం చేసుకున్న సేవారత్న డాక్టర్ మురుగన్

📰 Generate e-Paper Clip

12 గౌరవ డాక్టరేట్లు.. 28 అవార్డులతో సేవా ప్రస్థానంలో మరో మైలురాయి

సామాజిక, ధార్మిక సేవలను మరింత విస్తృతం చేస్తామని వెల్లడి

పలమనేరు, సెప్టెంబర్ 19 ( గరుడ ధాత్రి ) : సేవా, సామాజిక, ఆధ్యాత్మిక, విద్యా, వైద్య రంగాల్లో తనదైన సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంటాఊరు బీసీ కాలనీ శ్రీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్, ధర్మకర్త, సేవారత్న డాక్టర్ మురుగన్ ఖాతాలో మరో నాలుగు అవార్డులు చేరాయి. దీంతో ఇప్పటివరకు ఆయన 12 గౌరవ డాక్టరేట్లతో పాటు 28 అవార్డులు అందుకున్నట్లు తెలిపారు. పాండిచ్చేరిలోని అన్నామలై ఇంటర్నేషనల్‌లో ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గోల్డెన్ ఐకానిక్ అవార్డ్స్–2026’ కార్యక్రమంలో డాక్టర్ మురుగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజసేవ, విద్య, వైద్యం, ఆధ్యాత్మిక రంగాల్లో అందిస్తున్న సేవలను గుర్తిస్తూ పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను ఆయనకు ప్రదానం చేశారు. ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ అకాడమీ తరఫున గోల్డెన్ ఐకానిక్ అవార్డు–2026, అమెరికన్ విస్డమ్ పీస్ ఎడ్యుకేషన్ అకాడమీ తరఫున గౌరవ డాక్టరేట్, అలాగే భారత్ సేవారత్న అవార్డులతో పాటు మరో పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డాక్టర్ మురుగన్ అవార్డులు అందుకున్న సమయంలో సభా ప్రాంగణంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆయన సేవలను అభినందిస్తూ పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అవార్డులు అందుకున్న అనంతరం సేవారత్న డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ.. సామాజిక, ధార్మిక కార్యక్రమాలతో పాటు సహాయం కోసం తనను ఆశ్రయించే వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నానని తెలిపారు. తాను చేస్తున్న సేవలను గుర్తించి వివిధ సంస్థలు, యూనివర్సిటీల నుంచి అవార్డులు, గౌరవ డాక్టరేట్లు అందుతున్నాయని పేర్కొన్నారు.“ఒక్కో అవార్డు వెనుక ఎంతో కష్టం, బాధ్యత ఉంటుంది. ఈరోజు అందుకున్న అవార్డులు ప్రజా జీవితంలో నా బాధ్యతను మరింత పెంచాయి. ఇవి నా సేవా కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో కొనసాగించేందుకు ప్రేరణగా నిలుస్తాయి” అని డాక్టర్ మురుగన్ అన్నారు. తన సేవా, ధార్మిక కార్యక్రమాలకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సహకారం వల్ల తన సేవా కార్యక్రమాలు మరింత మంది ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.
తనకు అవార్డులు వచ్చిన సందర్భంగా వందలాది మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని, అదే సమయంలో కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారని డాక్టర్ మురుగన్ వ్యాఖ్యానించారు.“చేతనైతే పది రూపాయలు సహాయం చేయండి.. అంతేగాని విమర్శించడం మానండి” అంటూ విమర్శకులకు ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. విమర్శల కంటే సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. సామాజిక సేవతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తామని డాక్టర్ మురుగన్ తెలిపారు. ప్రజలకు అవసరమైన సందర్భాల్లో తన వంతు సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.
ఆధ్యాత్మిక, సామాజిక సేవా రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ, ఆపన్నులకు అండగా నిలుస్తున్న డాక్టర్ మురుగన్ సేవలను ఆయన అభినందించారు. సహాయం కోసం తన వద్దకు వచ్చిన వారికి లేదనకుండా తన వంతు సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో డాక్టర్ మురుగన్ మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టి, మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు. ఆయనకు లభిస్తున్న అవార్డులు సేవా కార్యక్రమాలకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు.

12 గౌరవ డాక్టరేట్లు.. 28 అవార్డులు..
సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న డాక్టర్ మురుగన్‌కు మరో నాలుగు పురస్కారాలు దక్కడం పలమనేరు ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!