ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పకడ్బందీగా ముఖ్యమంత్రి కుప్పం పర్యటన ఏర్పాట్లు

పకడ్బందీగా ముఖ్యమంత్రి కుప్పం పర్యటన ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

* ఏర్పట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పి,ఏఎస్ పి, ప్రజా ప్రతినిధులు.
* సీఎం పాల్గొనే ప్రాంతాల పరిశీలన.
కుప్పం,సెప్టెంబర్ 20 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నారు. సోమ మంగళవారం రెండు రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. దీంతో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకున్నారు. కుప్పం కొత్తపేటలోని సభ వేదికను, స్టాల్స్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాలను ఆదివారం అధికారుల బృందం పరిశీలించింది. అలాగే రైల్వే స్టేషన్, రైతు బజార్ శంకుస్థాపన ప్రదేశాన్ని పరిశీలించారు. జలహారతి ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు తగిన సూచనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనలు విజయవంతం చేసేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డుండి, కుప్పం ఏ ఎస్ పి హేమంత్ బొడ్డు, ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మెన్ పి.ఎస్. మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, మాజీ ఎంపీపీ డాక్టర్ వి. వెంకటేష్, రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ కే.ఎం. వేణుగోపాల్, కుప్పం అర్బన్ తెలుగుదేశం పార్టీ 11వ క్లాస్ ఇంచార్జ్ కె.కన్నన్, చంద్రబాబు నాయుడు కార్యదర్శి శ్రీకాంత్, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!