ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కృష్ణ జలాలకు నేడు కుప్పంలో జలహారతి

కృష్ణ జలాలకు నేడు కుప్పంలో జలహారతి

📰 Generate e-Paper Clip

* జల హారతి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం.
* కుప్పం ప్రజల్లో హర్షాతిరేఖాలు.
కుప్పం,సెప్టెంబర్ 20 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుప్పం శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలకు జలహారతి ఇవ్వనున్నారు. మంగళ బుధవారం రెండు రోజులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలి రోజు సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో శాంతిపురం మండలం గుండి శెట్టిపల్లి వద్ద హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువలో కృష్ణమ్మకు జల హారతి ఇవ్వనున్నారు. గత ఏడాది ఆగస్టు 30న కుప్పం సమీపంలోని పరమ సముద్రం వద్ద కృష్ణా జలాలకు ముఖ్య మంత్రి జలహారతి ఇచ్చారు. అప్పట్లో దాదాపు 110 చెరువులు కృష్ణా జలాలతో కళకళలాడింది. ప్రస్తుతం మళ్లీ నేడు సోమవారం కృష్ణ జలాలకు జల హారతి ఇవ్వనున్నారు.
అన్ని చెరువులకు కృష్ణా జలాల మళ్లింపుకు ప్లాన్: కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ఉన్న అన్ని చెరువులకు మళ్లించేందుకు నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కృష్ణా జలాలను మళ్లించేందుకు ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేశారు.రామకుప్పం మండలంలోని 128 చెరువుల్ని నింపేందుకు రూ.101.83 కోట్లు, శాంతిపురం మండలంలోని 87 చెరువుల కోసం రూ.78 కోట్లు, కుప్పంలోని 107 చెరువుల కోసం రూ.63.57 కోట్లతో పాటు గుడుపల్లె మండలంలోని చెరువులకు, కల్లివంక రిజర్వాయర్కు రూ.207 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళిక అమలైతే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కుప్పం కెనాల్ నీళ్లతో భూగర్భజల మట్టం పెరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!