ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

* జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కడపిడి వికాస్ మర్మత్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు.
కుప్పం,సెప్టెంబర్ 21 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం కుప్పం చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డుండి, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ , నాయకులు ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, హుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గు మళ్ల ప్రసాద్ రావు, చంద్రబాబు కార్యదర్శి మనోహర్ మాజీ శాసనమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు, జిల్లా టిడిపి అధ్యక్షులు షణ్ముగం రెడ్డి, చిత్తూరు శాసనసభ్యులు, పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!