ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సీఎం చంద్రబాబు సమక్షంలో వివిధ సంస్థలతో కడా డెవలప్మెంట్ అథారిటీ ఎంఓయూలు

సీఎం చంద్రబాబు సమక్షంలో వివిధ సంస్థలతో కడా డెవలప్మెంట్ అథారిటీ ఎంఓయూలు

📰 Generate e-Paper Clip

* సెర్ప్‌తో కలిసి రూపొందించిన మన రోవర్ మొబైల్ యాప్ విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
కుప్పం,సెప్టెంబర్ 21 (గరుడ ధాత్రి న్యూస్):
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఎం ఓ యు లను కుదుర్చుకున్నారు.కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు.
కింబర్లైట్ కెమికల్స్ లిమిటెడ్ సంస్థ రూ.90 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కాడాతో ఒప్పందం
•రూ. 250 కోట్ల పెట్టుబడితో హెర్బల్ ఉత్పత్తుల యూనిట్ ఏర్పాటుకు న్యూట్రలా జెనికా సంస్థ ఎంఓయూ 700 మందికి ఉపాధి.బొటానికల్ ఎక్స్ ట్రాక్ట్స్ ప్రాజెక్టు కోసం రూ.67 కోట్ల పెట్టుబడి, 8,250 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించేలా పయనీర్ ఎక్స్ ట్రాక్ట్స్ లిమిటెడ్.
రూ.150 కోట్లతో ఫ్రోజెన్ ఫుడ్స్, ఐస్ క్రీమ్ తయారీ కోసం ఎంగమ్ డైరీ ఫుడ్స్ ఎంఓయూ. 1,400 మందికి ఉపాధి అవకాశాలు.
ప్లాంటేస్ హెల్త్ కేర్ ఆరోగ్యపరమైన ఉత్పత్తుల తయారీకి రూ.25 కోట్ల పెట్టుబడి కోసం కడాతో ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీ వికాస్ మర్మత్, చిత్తూరు ఎంపీ దుర్గమల్ల ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!