* తిరుపతి నుండి వారణాసికి బైక్ యాత్ర
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03
(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్):
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తిరుపతి నుండి వారణాసి వరకు చేపట్టిన “సేవా సంకల్ప బైక్ యాత్ర” ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ యాత్ర మూడవ రోజున మంగళగిరి నుండి ప్రారంభమైంది. మార్గమధ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణలోకి అడుగుపెట్టిన బైక్ రైడర్లు భద్రాచలానికి చేరుకున్నారు.
తిరుపతి నుంచి వారణాసి వరకు సాగుతున్న సేవా సంకల్ప బైక్ యాత్ర 4వ రోజుకు చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, చైర్మన్ ప్రణవ్ గోపాల్ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో వారికి అర్చకులు అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ రామచంద్ర స్వామివారి ఆశీస్సులు లభించాలని, సమాజ సేవ, ఆధ్యాత్మిక చైతన్యమే లక్ష్యంగా చేపట్టిన ఈ బైక్ యాత్ర ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తికావాలని భద్రాద్రి రామయ్యను వేడుకున్నట్లు తెలిపారు.
