ఎమ్మెల్యే నేనా? శంకర్ రెడ్డా?
ఎస్సీ నియోజకవర్గంలో పెత్తందారుల పెత్తనమేంటి?
-ఎమ్మెల్యే ఆదిమూలం ఆవేదన
సొంత పార్టీ వారే కుట్రలు, కుతంత్రాలు
ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఇచ్చే గౌరవం ఇదేనా?
శంకర్ రెడ్డికి ఎమ్మెల్యే కంటే సకల మర్యాదలా?
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న
ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించి నాకు న్యాయం చేయండి
తిరుపతి సిటీ ప్రతినిధి
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో పెత్తందారులు పెత్తనం చెలాయించడం, దానికి ప్రభుత్వ అధికారులు, పోలీసులు సైతం వారికే ప్రాముఖ్యత ఇవ్వడం ఏంటని సత్యవేడు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో వైసిపి తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను 40 వేలకు పైగా మెజార్టీతో గెలవడం జరిగింది అన్నారు. 2024 ఎన్నికల్లో తనకు సత్యవేడు నియోజకవర్గం కాకుండా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని అప్పటి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటలు విని చెప్పగా, అందుకు తాను అంగీకరించలేదని, ఇస్తే సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని లేని పక్షంలో తాను రాజీనామా చేస్తానని చెప్పడం జరిగిందన్నారు. అయినా వారు తన మాట వినలేదన్నారు. అదే సందర్భంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో జరిగిన సభలో తన విషయం ప్రస్తావించడం జరిగిందన్నారు. ఆయన నాపై గౌరవంతో చెప్పిన మాటలు విని తాను తన కుమారుడు ఇద్దరూ నేరుగా వెళ్లి లోకేష్ ను చంద్రబాబు నాయుడు ను కలవడం జరిగింది అన్నారు. వారు నా 50 సంవత్సరాల రాజకీయ నేపథ్యం మొత్తం తెలిసిన వ్యక్తిగా నాకు సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కన్ఫర్మ్ చేయడం జరిగింది అని వివరించారు. అయితే ఆ ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు వైసీపీ నుండి పెద్దిరెడ్డి, ఇంకోవైపు టిడిపి మాజీ ఎమ్మెల్యే హేమలత, కొందరు నాయకులు కలిసి తనను ఓడించడానికి సాయి శక్తుల కృషి చేశారన్నారు. అయితే తన అభిమానులు, బంధువులు, స్నేహితులు, టిడిపి అభిమానులు, అలాగే ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులతో తాను భారీ మెజార్టీతో గెలిచారన్నారు. అనంతరం సత్యవేడు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా శంకర్ రెడ్డి అనే అగ్రకులానికి చెందిన వ్యక్తిని అధిష్టానం నియమించడం జరిగిందన్నారు. పార్టీ ఏదైనా తనపై ప్రజలకు ఉన్న నమ్మకంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచారని, అయితే సొంత పార్టీ వారే తనపై కుట్టలు కుతంత్రాలు చేయడం బాధాకరమన్నారు. దీనికి తోడు నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా తనకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వకుండా అధికారులు అలాగే పోలీసులు శంకర్ రెడ్డికి ఇవ్వడం ఇదెక్కడి విచిత్రమన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజా ప్రతినిధికి వారు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు. కొందరి రాజకీయ కుట్రలో భాగంగా తనపై మచ్చ పడిందని, అప్పుడు పార్టీ తనను సస్పెండ్ చేసిందని, అయితే ఆ మచ్చ కూడా తొలగి హైకోర్టులో తనకు క్లీన్ చీట్ రావడం జరిగిందన్నారు. తాను నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. తనను ఓడించాలని పనిచేసిన వారందరికీ నేడు గొప్ప గొప్ప పదవులను కట్టబెట్టడం దేనికి సంకేతం అన్నారు. చంద్రబాబు నాయుడు తనపై గౌరవంతో సీటు ఇవ్వడం, తాను భారీ మెజారిటీతో గెలవడం, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి తాను నిరంతరం శ్రమిస్తున్నానని అన్నారు. పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి శంకర్ రెడ్డి కి ఎమ్మెల్యేకి మించి అధికారాలు, ప్రోటోకాల్ ఇవ్వడం ఏంటని నిలదీశారు. ఎంపీడీవోలు, పోలీసులు సైతం అతనికే గౌరమ్మ దళితుడైన తనను అవమానించడమే అన్నారు. అసలు మా నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదో, అసలు రిజర్వుడ్ కాన్స్టెన్సీ లో రెడ్డి ఇన్చార్జిగా ఉండడం అసలు అర్థం కావడం లేదన్నారు. రాజా బుధవారం రోజున రాచర్లలో సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైతం తన కాంసెన్సీ కి వచ్చి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసి చిన్న ప్రెస్ మీట్ పెట్టి అనంతరం వెళ్లేటప్పుడు సైతం కారులో శంకర్ రెడ్డిని ఎక్కించుకుని వెళ్లడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. అసలు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నేనా శంకర్ రెడ్డినా అన్న అనుమానం కలుగుతుందన్నారు. శంకర్ రెడ్డి పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా నియామకం చెందినప్పటి నుంచి ఆయన పెత్తనం ఎక్కువైందని, అసలు పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విధులు ఏంటి అని ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం తనపై సమగ్ర విచారణ చేస్తే తాను ఎలాంటి వాడినని అర్థమవుతుందన్నారు. రిజర్వుడు నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తనం ఉన్నంతవరకు పార్టీకి నష్టం తప్ప ఒరిగేదేమీ లేదని, కావున అగ్రవర్ణాల పెత్తనం ఉండకూడదని, దీనిపై సీఎం దృష్టి సారించాలని ఎమ్మెల్యే ఆదిమూలం స్పష్టం చేశారు.
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న..
తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 14న సత్యవేడు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి టిడిపి పార్టీలోని కొంతమంది వ్యక్తులు వ్యతిరేకించిన,నా మీద నమ్మకముతో టికెట్ కేటాయించారని,అసమ్మతి వ్యక్తులతో స్వయానా చంద్రబాబు నాయుడు మాట్లాడి ఆదిమూలమును గెలిపించాలని చెప్పినా, పార్టీలోని కొంతమంది ఓడించడానికి వాళ్ళ శాయశక్తుల ప్రయత్నించారని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. సత్యవేడు ప్రజలు నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని,వారి ఆశీర్వాదంతో గెలిచానని,నా గెలుపుకు టిడిపి పార్టీ పని చేసిందని,నేను సైకిల్ సైకిల్ గుర్తుపైనే గెలిచానన్నారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. పెద్దిరెడ్డి అనుచరుడు వైసీపీ తరఫున పోటీకి పెట్టినా, కాంగ్రెస్ పార్టీ తరఫున హేమలత ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయించిందని,నన్ను ఓడించడానికి వారి శాయ శక్తుల పని చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సత్యవేడు ప్రజల అండదండలతో,దేవుని ఆశీర్వాదంతో గెలిచాను అన్నారు.గతంలో 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పని చేశానని, కొన్ని ఇబ్బందుల దృష్ట్యా నాకు టిక్కట్టు ఇవ్వకపోవడంతో వేరే పార్టీలో పోవడం జరిగిందని,టిడిపి తో నా అనుబంధం కొనసాగింది అన్నారు.ఎవరు ఎన్ని కుట్రలు పన్నిన్నా సత్య వేడు ప్రజలు నాతోనే ఉన్నారు కనుక నేను ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నానని పేర్కొన్నారు.నేను గెలిచిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో కొంతమంది వ్యక్తులు చాలా ఇబ్బందులు పెట్టారని, ఆ ఇబ్బందుల డిప్రెషన్ వల్ల నా తమ్ముడు చనిపోయాడని ఆరోపించారు.నేను పదవులు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్య,సమస్యలు తీర్చే వ్యక్తిగా, సత్తి వేడు అభివృద్ధిలో,ప్రజలతోనే ఉన్నానని చెప్పారు. మమ్మలను ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో మా కుమారుడు మనస్థాపం చెంది మాట్లాడిన మాటలే కానీ వ్యక్తిగతంగా మాట్లాడినవి కాదన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,నారా లోకేష్ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ద్వారా నేను ఏ తప్పు చేశానో వారి నుండి సమాచారం తీసుకుని,సత్యవేడు లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరారు.
నా ఓటమి కోసం పనిచేసిన వ్యక్తులకు మార్కెట్ కమిటీ లోను,దేవస్థానాలలో, మండల పార్టీ అధ్యక్షులుగా పదవులు ఇస్తున్నారని వాపోయారు.కో ఆర్డినేటర్ గా ఉన్న శంకర్ రెడ్డి తిరుపతిలో కాపురం ఉన్నాడని, కో ఆర్డినేటర్ పని ఎంతవరకో అంతవరకు చేయచ్చని, పూర్తిస్థాయి ఎమ్మెల్యేగా వ్యవహరించి,ఎమ్మెల్యే ప్రోటోకాల్ ను, తన ప్రోటోకాల్ గా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.నేను ఎక్కడ అవినీతి కార్యక్రమాలు చేయలేదని,ఇసుక,మట్టి గ్రావిల్ లాంటివి తమిళనాడుకు ఎప్పుడు తరలించలేదని,నీతి నిజాయితీతో పని చేశానని చెప్పారు. ఎప్పుడు ఏ పదవిలో ఉన్న సత్యవేడు అభివృద్ధికి పనిచేశానని, చెప్పారు.ప్రస్తుతం నియోజకవర్గము నుండి తమిళనాడుకు మట్టి,ఇసుక, వాళ్ల ఇష్టానుసారంగా తరలిస్తున్నారని, ఎస్సీ నియోజకవర్గానికి రెడ్డి సామాజిక వర్గం కి చెందిన వ్యక్తిని నియమించడం సమంజసం కాదని పేర్కొన్నారు.శంకర్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నడూ నా ప్రచారం కోసం కానీ, టిడిపి పార్టీకి కానీ పనిచేయలేదని,నా గెలుపుకు సహకరించలేదని,అలాంటి వ్యక్తికి అధికారులు వెంట వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు.నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రిలను,కలెక్టర్లను, ఎమ్మార్వో లను, అధికారులను, చూశానని, ఎన్నడూ లేని విధంగా సత్యవేడు నియోజకవర్గంలో అధికారులు ప్రవర్తిస్తున్న తీరును,స్పీకర్ కి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. అధికారులు,పోలీసు యంత్రాంగం,ప్రోటోకాల్ ను దుర్వినియోగం చేస్తున్నదని, చంద్రబాబు నాయుడు సత్యవేడు నియోజకవర్గంపైన దృష్టి పెట్టి తనకు న్యాయం చేయాలని కోరారు.
