ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివేడుకగా ముత్యాలమ్మ,ముత్యాలయ్య గ్రామోత్సవం

వేడుకగా ముత్యాలమ్మ,ముత్యాలయ్య గ్రామోత్సవం

📰 Generate e-Paper Clip

వేడుకగా ముత్యాలమ్మ,ముత్యాలయ్య గ్రామోత్సవం

పిచ్చాటూరు మండలం కీలపూడిలో జరుగుతున్న ముత్యాలమ్మ కొలుపు అత్యంత వైభవంగా జరుగుతోంది.
ముత్యాలమ్మ కొలుపు లో రెండవ రోజైన శనివారం సాయంత్రం స్వామి, అమ్మవార్ల ను ట్రాక్టర్ పై అధిష్టించి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకారం చేశారు.
అనంతర మంగళ వాయిద్యాలు, డప్పుల మోత లతో స్వామి, అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు.
కీలపూడి గ్రామ ప్రజలు కొబ్బరి కాయలు కొట్టి, మంగళ హారతులతో స్వామి, అమ్మ వార్లకు స్వాగతం పలికారు.
ఆలయ ధర్మకర్త పాలు పద్మనాభం, యాదవ కుల పెద్దలు గ్రామోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆదివారం సాయంత్రం కంకణం ధరించిన దీక్షాపరుల అగ్నిగుండం ప్రవేశం ఉంటుందని ఆలయ ధర్మకర్త పాలు పద్మనాభం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!