ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎర్ర బాడ్జీలతో ఏపి పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా

ఎర్ర బాడ్జీలతో ఏపి పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా

📰 Generate e-Paper Clip

ఎర్ర బాడ్జీలతో ఏపి పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా

గరుడధాత్రి న్యూస్ :

ఏపి పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 16,17 తేదీలలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఆదివారం ఉద్యోగులు ఎర్ర బాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం డిపో కార్యదర్శి ఎస్. మధుబాబు ఆధ్వర్యంలో డిపో గేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డిపో కార్యదర్శి మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నడపాలని, ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే కొత్త బస్సుల కొనుగోలు చేపట్టాలని, శ్రీ శక్తి పథకం కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు డీఏ, పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్వైజర్ వి. మహేశ్వర, కోశాధికారి కార్తీక్, జాయింట్ సెక్రటరీ ఎస్.ఎం. భాష, పబ్లిసిటీ కార్యదర్శి శ్రీనివాసులు, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి సరిత, గ్యారేజ్ అధ్యక్షుడు మునుస్వామి, సీనియర్ నాయకులు రామ్మూర్తి, వెంకటయ్య, నాగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!