ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

📰 Generate e-Paper Clip

మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

-సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

-తిరుపతి కలెక్టర్ కార్యాలయం లో సముద్ర చేపల వేట నిషేధ భృతి పథకం ప్రారంభం

– కలెక్టరేట్ వీసీ హాల్‌లో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

మత్స్యకారుల సంక్షేమానికి వారి ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు.
మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారుల సేవలో సముద్ర చేపల వేట నిషేధ భృతి పథకం (2026-27) ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ భృతిని సకాలంలో అందిస్తోందని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, మత్స్యశాఖ అధికారులతో కలిసి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి, ఇతర ఉన్నతాధికారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!