ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపిచ్చాటూరులో ప్రకృతి బీభత్సం.. నేలకొరిగిన శతాధిక వృక్షం

పిచ్చాటూరులో ప్రకృతి బీభత్సం.. నేలకొరిగిన శతాధిక వృక్షం

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరులో ప్రకృతి బీభత్సం.. నేలకొరిగిన శతాధిక వృక్షం

-ఎస్సై రాఘవేంద్ర చొరవతో పునరుద్ధరణమైన రాకపోకలు

పిచ్చటూరు మే 21 గరుడధాత్రిన్యూస్ :
పిచ్చాటూరు మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మండల పరిధిలోని శేషంబేడు గ్రామంలో వందేళ్ల చరిత్ర కలిగిన భారీ వృక్షం గాలివాన ధాటికి ఒక్కసారిగా నేలకొరిగింది. ప్రధాన రహదారిపై చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పిచ్చాటూరు ఎస్సై బి. రాఘవేంద్ర తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక గ్రామస్థుల సహకారంతో రహదారికి అడ్డంగా పడిన భారీ చెట్టును, కొమ్మలను తొలగించి యుద్ధప్రాతిపదికన రాకపోకలను పునరుద్ధరించారు.
విపత్కర పరిస్థితుల్లో వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్న ఎస్సై రాఘవేంద్ర మరియు పోలీసు సిబ్బందిపై గ్రామస్థులు ప్రశంసలు కురిపించారు. శేషంబేడు గ్రామ ప్రజలు పోలీసు బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!