ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివడదెబ్బకు గురై వృద్ధురాలు మృతి

వడదెబ్బకు గురై వృద్ధురాలు మృతి

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు మే 25 గరుడధాత్రి :
పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామంలో వడదెబ్బ కారణంగా ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
ఆదివారం మండలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో నీరువాయి గ్రామానికి చెందిన క్రిష్టమ్మ (74) అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆమెకు కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు.
గ్రామంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!