ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిడాక్టర్ నరసింహులుకు జార్జ్ విజయ్ అభినందనలు

డాక్టర్ నరసింహులుకు జార్జ్ విజయ్ అభినందనలు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, మే 31 గరుడధాత్రి : సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొందిన డాక్టర్ నరసింహులు కు పిచ్చాటూరు టీడీపీ యువజన నాయకుడు జార్జ్ విజయ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతి ఎస్‌జీఎస్ కళాశాలలో తనతో కలిసి చదువుకున్న స్నేహితుడు డాక్టర్ నరసింహులు ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యారంగంలో ఆయన చూపిన అంకితభావం, కృషి, నిబద్ధతకు ఈ పదోన్నతి తగిన గుర్తింపు అని పేర్కొన్నారు.
డాక్టర్ నరసింహులు నాయకత్వంలో సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరింత అభివృద్ధి చెందడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి విద్యారంగానికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరసింహులు భవిష్యత్ ప్రయాణం విజయవంతంగా సాగాలని, ఆయురారోగ్యాలతో మరిన్ని విజయాలు సాధించాలని జార్జ్ విజయ్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!