ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమలేరియా నివారణ మాసోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

మలేరియా నివారణ మాసోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, జూన్ 2 గరుడధాత్రి :

జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న మలేరియా నివారణ మాసోత్సవం సందర్భంగా పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మలేరియా నివారణపై అవగాహన కల్పిస్తూ “దోమ కాటును అరికట్టండి – మలేరియాను నిర్మూలించండి”, “ప్రతి రాత్రి దోమతెర వాడండి – మలేరియాను దూరం పెట్టండి”, “పరిసరాల పరిశుభ్రత – ఆరోగ్యకర జీవితం”, “నీరు నిల్వ లేకపోతే – దోమల పెరుగుదల ఉండదు”, “మలేరియాను నివారించండి – ప్రాణాలను కాపాడండి”, “దోమలను నాశనం చేయండి – సమాజాన్ని రక్షించండి” వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా. ధనుష్, సామాజిక ఆరోగ్య అధికారి శివయ్య, ఆరోగ్య పర్యవేక్షకులు రాజారావు, వెంకటలక్ష్మమ్మ, ఆరోగ్య కార్యకర్తలు, ఎంఎల్‌హెచ్‌పీలు (MLHPs), సీహెచ్‌వోలు (CHOs), ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి మలేరియా వంటి వ్యాధులను నివారించవచ్చని వైద్యాధికారులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!