ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికేవీబీపురం లో టీడీపీ యూనిట్ సమావేశం

కేవీబీపురం లో టీడీపీ యూనిట్ సమావేశం

📰 Generate e-Paper Clip

కె.వి.బి. పురం, జూన్ 3 గరుడధాత్రి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు, కె.వి.బి. పురం మండల టీడీపీ అధ్యక్షులు మునస్వామి యాదవ్ సూచనలతో, క్లస్టర్-4 ఇంచార్జ్ దొరబాబు నాయుడు ఆధ్వర్యంలో నెలలో మొదటి బుధవారం నిర్వహించే యూనిట్ సమావేశం ఈరోజు నిర్వహించారు.

ఈ సమావేశంలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఓటరు జాబితాలో జరుగుతున్న మార్పులు-చేర్పులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటి పరిష్కారాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా క్లస్టర్-4 ఇంచార్జ్ దొరబాబు నాయుడు గారు నాయకులు, కార్యకర్తలకు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాళంగి రిజర్వాయర్ చైర్మన్ రాజా రెడ్డి, యూనిట్ ఇంచార్జ్ సురేష్ నాయుడు, నాయకులు బండి బాబు, ధనుంజేయులు నాయుడు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!